భారీగానే వ్యూస్ కొల్లగొడుతున్న 'బంగార్రాజు'

07-12-2021 Tue 18:09
  • నాగార్జున హీరోగా 'బంగార్రాజు'
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
  • సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్
  • సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్స్  
Bangarraju Movie Update
నాగార్జున కథానాయకుడిగా గ్రామీణ నేపథ్యంలో 'బంగార్రాజు' రూపొందుతోంది. ఈ మధ్యనే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా చకచకా షూటింగు జరువుకుంటోంది. జీ స్టూడియోస్ వారితో కలిసి నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాకి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లకు .. లిరికల్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి, చైతూ .. కృతి శెట్టిపై చిత్రీకరించిన ఒక పాటను వదిలారు. 'కొత్తగా నాకేమైందో .. వింతగా ఏదో మొదలైందో' అంటూ సాగే ఈ పాట యూత్ మనసులను ఆకట్టుకుంటోంది. బాలాజీ సాహిత్యం .. సిద్ శ్రీరామ్ ఆలాపన ప్రత్యేక ఆకర్షణ.

యూ ట్యూబ్ లో ఈ పాటను ఇలా వదలగానే అలా దూసుకుపోయింది. ఇంతవరకూ 3 మిలియన్ వ్యూస్ కి పైగా కొల్లగొట్టింది. ప్రస్తుతం అదే స్పీడ్ ను కంటిన్యూ చేస్తోంది. సంక్రాంతి పండుగకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.