ఏపీలో కొత్తగా 184 కరోనా పాజిటివ్ కేసులు

07-12-2021 Tue 17:36
  • గత 24 గంటల్లో 30,747 కరోనా పరీక్షలు
  • కృష్ణా జిల్లాలో 34 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 2,008 మందికి చికిత్స
AP Daily Corona Update
ఏపీలో గడచిన 24 గంటల్లో 30,747 శాంపిల్స్ పరీక్షించగా 184 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 34 కొత్త కేసులు నమోదు కాగా, శ్రీకాకుళం జిల్లాలో 22, విశాఖ జిల్లాలో 20 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్తకేసులేవీ నమోదు కాలేదు.

అదే సమయంలో 204 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,74,036 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 20,57,573 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 2,008 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,455కి పెరిగింది.