ఈటల రాజేందర్ ముక్కు నేలకు రాయాలి: బాల్క సుమన్

07-12-2021 Tue 16:51
  • పేద ప్రజల భూములను కబ్జా చేశారు
  • కబ్జా చేసినట్టు జిల్లా కలెక్టర్ నివేదిక ఇచ్చారు
  • ఈటలపై చట్ట పరంగా ఏమేం జరగాలో అన్నీ జరుగుతాయి
Balka Suman demands Etela Rajender to say sorry
బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేద ప్రజలకు చెందిన అసైన్డ్ భూములను ఈటల కబ్జా చేశారని అన్నారు. ఈటలకు చెందిన జమునా హేచరీస్ 70 ఎకరాల భూమిని కబ్జా చేసినట్టు మెదక్ జిల్లా కలెక్టర్ కూడా నివేదిక ఇచ్చారని చెప్పారు.

మెదక్ జిల్లా కలెక్టర్ పై ఈటల కుటుంబీకులు చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని అన్నారు. ఆక్రమించుకున్న భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. చేసిన తప్పులకు ఈటల ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని అన్నారు. రాబోయే రోజుల్లో ఈటలపై చట్టపరంగా ఏమేం జరగాలో అన్నీ జరుగుతాయని తెలిపారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాల్క సుమన్ పైవ్యాఖ్యలు చేశారు.