చెన్నైలో రజనీకాంత్ ను కలిసిన శశికళ

07-12-2021 Tue 16:14
  • రజనీ నివాసానికి వెళ్లిన చిన్నమ్మ
  • రజనీ, లత దంపతులతో భేటీ
  • రజనీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న వైనం
  • దాదాసాహెబ్ పురస్కారం అందుకున్నందుకు అభినందనలు
Sasikala met Rajinikanth in Chennai
దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలిశారు. చెన్నైలోని పొయెస్ గార్డెన్ లో ఉన్న రజనీ నివాసానికి వచ్చిన శశికళ ఆయనతో భేటీ అయ్యారు. రజనీ, ఆయన అర్ధాంగి లతతో ఆమె ముచ్చటించారు. రజనీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం పట్ల రజనీని ఆమె అభినందించారు. కాగా, ఇది మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశమేనని శశికళ ప్రతినిధులు వెల్లడించారు.