South Africa: భారత్ తో టెస్టు సిరీస్ కు దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన

South Africa team announced for three tests with Team India
  • దక్షిణాఫ్రికాలో భారత్ పర్యటన 
  • డిసెంబరు 26 నుంచి మూడు టెస్టుల సిరీస్
  • 21 మందితో జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా
  • కెప్టెన్ గా డీన్ ఎల్గార్
త్వరలో భారత్ తో జరగనున్న మూడు టెస్టుల సిరీస్ కు దక్షిణాఫ్రికా జట్టును నేడు ప్రకటించారు. త్వరలోనే భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబరు 26 నుంచి వచ్చే ఏడాది జనవరి 15 వరకు టెస్టు సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ లో మూడు టెస్టులకు సెంచురియన్, జోహాన్నెస్ బర్గ్, కేప్ టౌన్ ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ సిరీస్ కోసం 21 మందితో కూడిన సఫారీ జట్టును ఎంపిక చేశారు. సీనియర్ ఓపెనర్ డీన్ ఎల్గార్ కెప్టెన్ గా, టెంబా బవుమా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. జట్టులో సిసాండా మగాలా, రియాన్ రికెల్టన్ ఇద్దరూ కొత్త ముఖాలు.

దక్షిణాఫ్రికా జట్టు ఇదే...

డీఎన్ ఎల్గార్ (కెప్టెన్), టెంబా బవుమా (వైస్ కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), కగిసో రబాడా, వాన్ డర్ డుస్సెన్, బ్యూరాన్ హెండ్రిక్స్, జార్జి లిండే, ఐడెన్ మార్ క్రమ్, వియాన్ ముల్డర్, ఆన్రిచ్ నోర్జే, కీగాన్ పీటర్సన్, సారెల్ ఎర్వీ, కైల్ వెర్రీన్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, లుంగీ ఎంగిడి, డువానే ఒలివియర్, గ్లెంటన్ స్టుర్మాన్, ప్రెనెలాన్ సుబ్రాయెన్, సిసాండా మగాలా, రియాన్ రికెల్టన్.
South Africa
Test Series
Team India
Three Tests

More Telugu News