‘అధీర’ మాటల తూటాలు.. డబ్బింగ్ పూర్తి చేసిన సంజయ్ దత్

07-12-2021 Tue 13:23
  • వెల్లడించిన చిత్ర యూనిట్
  • ఏప్రిల్ 14న కేజీఎఫ్ చాప్టర్ 2 విడుదల
  • పవర్ ఫుల్ పాత్రలో సంజయ్ దత్
Sanjay Dutt Completes Dubbing For Adheera In KGF Chapter 2
కేజీఎఫ్ 2.. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. ప్రశాంత్ నీల్, యశ్ కాంబోలో వచ్చిన ‘కేజీఎఫ్’ తొలి భాగం.. బాక్సాఫీస్ మైన్స్ వద్ద ఎంతలా బ్లాస్ట్ అయిందో తెలిసిందే. అదే కాంబోలో రెండో భాగం రెడీ అయిపోయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ప్రస్తుతం చిత్రానికి సంబంధించి డబ్బింగ్ పనులు చకచకా జరుగుతున్నాయి. తాజాగా సినిమాలో పవర్ ఫుల్ అధీర మాటల తూటాలు పేల్చేస్తున్నాడు. ఆ పాత్రకు డబ్బింగ్ పూర్తయింది. ఆ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కనిపించనున్నారు. దీంతో ఆయన తన పాత్రకు డబ్బింగ్ ను పూర్తి చేశారని పేర్కొంటూ డబ్బింగ్ థియేటర్ లో ఉన్న ఫొటోలను పోస్ట్ చేశారు.

‘‘అధీర యాక్షన్ లోకి వచ్చేశాడు. కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం డబ్బింగ్ పూర్తయింది. ఏప్రిల్ 14న మీ అందరి ముందుకు వచ్చేస్తాడు’’ అంటూ సంజయ్ దత్, ప్రశాంత్ నీల్, సినిమా నిర్మాత ట్వీట్ చేశారు.