వరదబాధితుల సహాయార్థం ప్రభాస్ భారీ విరాళం

07-12-2021 Tue 12:31
  • భారీ వర్షాలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్
  • పెద్ద ఎత్తున విరాళాలను అందిస్తున్న సినీ ప్రముఖులు
  • కోటి రూపాయల విరాళాన్ని అందించిన ప్రభాస్
Prabhas announces Rs1 CR towards the relief of AndhraPradesh Flood Disaster Victims
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమయింది. పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు వారి వంతు సహాయం చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్ బాబు రూ. 25 లక్షల చొప్పున విరాళం అందించారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు వీరు ఈ విరాళాన్ని అందించారు. అల్లు అరవింద్ రూ. 10 లక్షలు ఇచ్చారు.

తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా భారీ విరాళాన్ని ప్రకటించారు. ఏకంగా కోటి రూపాయల విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించనున్నారు. గతంలో కూడా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ప్రభాస్ భారీ విరాళాలను అందించారు.