పెళ్లిపీటలు ఎక్కుతున్న బాలీవుడ్ ప్రేమజంటపై కేసు నమోదు!

07-12-2021 Tue 12:00
  • రాజస్థాన్ కోటలో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి
  • చౌత్ మాత మందిర్ కు వెళ్లే దారి మూసివేత
  • పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన స్థానికులు
Police case registered against Katrina Kaif and Vicky Kaushal
బాలీవుడ్ ప్రేమజంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లిపీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోటలో అంగరంగ వైభవంగా జరగబోతోంది. అయితే ఈ జంటకు స్థానికులు షాకిచ్చారు. రాజస్థాన్ లో చౌత్ మాత మందిర్ ఎంతో ప్రఖ్యాతిగాంచింది. నిత్యం భక్తులతో ఆ మందిరం రద్దీగా ఉంటుంది. అయితే వీరి పెళ్లి నేపథ్యంలో మందిర్ కు వెళ్లే రోడ్డును ఈవెంట్ నిర్వాహకులు మూసేశారు. దీంతో, స్థానికులు వీరిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

మందిర్ కు వెళ్లకుండా నిర్వాహకులు అడ్డుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరో పెళ్లి కోసం గుడికి వెళ్లే దారిని మూసేయడం ఏమిటని ప్రశ్నించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు దీనిపై ఈవెంట్ నిర్వాహకులు స్పందిస్తూ... కత్రిన, విక్కీ కౌశల్ పెళ్లి ఎన్నో భద్రతా నియమాల మధ్య జరుగుతోందని... అందుకే దారిని మూసేశామని చెప్పారు.