'ఆర్ ఆర్ ఆర్' నుంచి దూసుకొస్తున్న ట్రైలర్!

07-12-2021 Tue 11:34
  • 'ఆర్ ఆర్ ఆర్' ప్రమోషన్స్ దూకుడు
  • ఒకే రోజున వదిలిన రెండు పోస్టర్లు
  • ఈ నెల 9వ తేదీన రానున్న ట్రైలర్
  • జనవరి 7వ తేదీన సినిమా రిలీజ్
RRR trailer will release on December 9th
ఎన్టీఆర్ - చరణ్ కాంబినేషన్లో 'ఆర్ ఆర్ ఆర్' రూపొందింది. రాజమౌళి దర్శకత్వంలో .. డీవీవీ దానయ్య నిర్మాణంలో ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. జనవరి 7వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి చకచకా అప్ డేట్స్ వదులుతున్నారు.

నిన్న ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ - చరణ్ కి సంబంధించిన కొత్త పోస్టర్లను వేరు వేరుగా వదిలారు. ఇద్దరూ కలిసి ఉన్న పోస్టర్ ను రెండు రోజుల్లో వదలనున్నట్టుగా తెలుస్తోంది. ఇంతవరకూ రిలీజ్ చేసిన పోస్టర్లలో రానున్న పోస్టర్ హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

పోస్టర్స్ పరంగా ఆసక్తిని రేకెత్తిస్తూ .. సింగిల్స్ పరంగా ఆత్రుతను పెంచుతున్న ఈ సినిమా, ట్రైలర్ తో ఏ స్థాయి రికార్డులను సెట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాలో అలియా భట్ .. అజయ్ దేవగణ్ వంటి బాలీవుడ్ ఆర్టిస్టులతో పాటు, హాలీవుడ్ ఆర్టిస్టులు కూడా నటించిన సంగతి తెలిసిందే.