భద్రాచలం సీతారామచంద్ర స్వామికి మంత్రి కొడాలి నాని కానుక!

07-12-2021 Tue 11:31
  • కుటుంబ సమేతంగా భద్రాద్రి రాముడిని దర్శించుకున్న కొడాలి నాని
  • రూ. 13 లక్షల విలువ చేసే కిరీటం సమర్పణ
  • తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించానని వ్యాఖ్య
Kodali Nani gift to Bhadrachalam Sri Rama swamy
భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారిని ఏపీ మంత్రి కొడాలి నాని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాముడికి రూ. 13 లక్షలు విలువ చేసే బంగారు కిరీటాన్ని కానుకగా సమర్పించారు. ఈ కిరీటాన్ని ఆలయ అర్చకులకు అందించారు.

అనంతరం మీడియాతో కొడాలి నాని మాట్లాడుతూ, ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నానని చెప్పారు. ఏపీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు మరింత శక్తిని ఇవ్వాలని ప్రార్థించానని తెలిపారు. ఏపీ ప్రజలు ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలనేదే జగన్ ఆకాంక్ష అని చెప్పారు.