ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ప్రైవేట్ లేఔట్ల నిర్మాణాల్లో 5 శాతం భూమిని ప్రభుత్వానికి ఇవ్వాలి!

07-12-2021 Tue 11:12
  • లేఔట్లో భూమి లేకపోతే 3 కి.మీ. పరిధిలో భూమిని కొని ఇవ్వాలి
  • లేకపోతే దాని విలువకు సమానమైన డబ్బులు చెల్లించాలి
  • ఈ భూములను, డబ్బులను జగనన్న కాలనీల నిర్మాణాలకు వినియోగించనున్న ప్రభుత్వం
5 percent of private layouts land should be given to AP govt
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో వేసే ప్రైవేట్ లేఔట్ల నిర్మాణాల్లో 5 శాతం భూమిని ప్రభుత్వానికి ఇవ్వాలని ఉత్తర్వులను విడుదల చేసింది. ఒకవేళ ఆ లేఔట్లో భూమిని ఇవ్వలేకపోతే... లేఔట్ కు మూడు కిలోమీటర్ల పరిధిలో భూమిని కొని ఇవ్వాలని నోటిఫికేషన్ లో పేర్కొంది. ఒక వేళ అలా కూడా భూమిని ఇవ్వలేకపోతే దాని విలువకు సమానమైన డబ్బులు చెల్లించే అవకాశాన్ని కూడా కల్పించింది.

భూమిని జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ లేఔట్ల ద్వారా వచ్చే భూమి లేదా డబ్బును జగనన్న కాలనీల నిర్మాణాలకు వినియోగించనున్నట్టు తెలిపింది. ఈ ఉత్తర్వుల పట్ల రియలెస్టేట్ వ్యాపారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.