'పుష్ప' ట్రైలర్ దూకుడు మామూలుగా లేదే!

07-12-2021 Tue 10:59
  • 'పుష్ప' రాజ్ గా అల్లు అర్జున్  
  • అడవి నేపథ్యంలో సాగే కథ
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
  • ఈ నెల 17వ తేదీన విడుదల
Pushpa movie update
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. అడవి నేపథ్యంలో .. ఎర్రచందనం అక్రమరవాణా చుట్టూ ఈ కథ తిరగనుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను, డిసెంబర్ 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి నాలుగు భాషల్లో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. నిన్న సాయంత్రం రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. నాలుగు భాషల్లోను కలుపుకుని, ఇంతవరకూ 15 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసింది. అదే జోరును కొనసాగిస్తూ ముందుకు దూసుకుపోతోంది.

ఈ ట్రైలర్ లో అసలు కథతో పాటు .. పాత్రలు .. వాటి స్వరూప స్వభావాలను పూర్తిగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. పుష్ప పాత్రను అన్ని కోణాల్లో ఆవిష్కరించారు. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా ఫాహద్ ఫాజిల్ కనిపించనున్నాడు. ఇతర ముఖ్య పాత్రలను జగపతిబాబు .. సునీల్ .. అనసూయ పోషించారు. .