ఇండియాలో కొత్తగా 6,822 కరోనా కేసుల నమోదు.. 23కు పెరిగిన ఒమిక్రాన్ కేసులు!

07-12-2021 Tue 10:48
  • గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న 10,004 మంది 
  • ఇదే సమయంలో 220 మంది మృతి
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 95,014
India reports 6822 new corona cases
ఇండియాలో గత 24 గంటల్లో 10,79,384 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా కొత్తగా 6,822 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 10,004 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 220 మంది కరోనా వల్ల మృతి చెందారు. ఒక్క కేరళలోనే 168 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

ఇక దేశంలో వైరస్ క్రియాశీల రేటు 0.27 శాతానికి తగ్గగా... రికవరీ రేటు 98.36 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 95,014గా ఉంది. ఇప్పటి వరకు 128.76 కోట్ల వ్యాక్సిన్ డోసులను వేశారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 23కు చేరాయి.