అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించిన రామ్ గోపాల్ వర్మ

07-12-2021 Tue 09:44
  • రియలిస్టిక్ క్యారెక్టర్లు చేయడానికి భయపడని సూపర్ స్టార్ అల్లు అర్జున్
  • అలాంటి పాత్రలు పవన్, మహేశ్, చిరు, రజనీ చేయగలరా?
  • 'పుష్ప' అంటే పుష్పం కాదు.. అదొక ఫైర్
Allu Arjun is the only super star who can do realistic characters says Ram Gopal Varma
ఎప్పుడూ ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై ప్రశంసల జల్లు కురిపించారు. అల్లు అర్జున్ తాజా చిత్రం 'పుష్ప' విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ ను చూసి వర్మ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.

రియలిస్టిక్ క్యారెక్టర్లను చేయడానికి ఏమాత్రం భయపడని ఒకే ఒక్క సుపర్ స్టార్ అల్లు అర్జున్ అని వర్మ కితాబునిచ్చారు. ఇలాంటి పాత్రలను పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, చిరంజీవి, రజనీకాంత్ తదితరులు చేయగలరా? అని ప్రశ్నించారు. 'పుష్ప' అంటే పుష్పం కాదని... అది ఫైర్ అని అన్నారు. ఈ మేరకు వర్మ ట్వీట్ చేశారు.

ఈ నెల 17న 'పుష్ప' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో బన్ని సరసన కన్నడ భామ రష్మిక మందన్న నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.