ఇకపై కన్నీళ్లు పెట్టుకోను: కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి

07-12-2021 Tue 09:27
  • గతంలో కన్నీళ్లు పెట్టుకోవడంపై విమర్శలు
  • అంతమాత్రాన గుండెను రాయిచేసుకోబోను
  • కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యపై విమర్శలు
Kumaraswamy decided to not shed tears
గతంలో పలుమార్లు విలేకరుల సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఇకపై కన్నీళ్లు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పారు. తన కన్నీళ్లపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయనీ నిర్ణయం తీసుకున్నారు. కన్నీళ్లు పెట్టనని చెప్పినంత మాత్రాన ఘటనలకు స్పందించకుండా గుండెను రాయి చేసుకుంటానని అర్థం కాదన్నారు.

విధాన పరిషత్ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది నేడు ప్రకటిస్తానన్నారు. బీజేపీకి మద్దతు ఇస్తానని తానెక్కడా ప్రకటించలేదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. జేడీఎస్ కుటుంబ రాజకీయాల గురించి విమర్శించడానికి ముందు కాంగ్రెస్ పరిస్థితి గురించి ఒకసారి ఆలోంచాలని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యకు హితవు పలికారు. తండ్రీకొడుకులు ఇద్దరూ శాసనసభ్యులుగా ఉన్న విషయాన్ని మర్చిపోయారా? అని కుమారస్వామి ఎద్దేవా చేశారు.