ఇది చిరంజీవి మెగా రికార్డు!

06-12-2021 Mon 22:21
  • ప్రస్తుతం 4 చిత్రాల్లో నటిస్తున్న చిరంజీవి
  • ఈ నెలలో షూటింగ్ జరుపుకుంటున్న నాలుగు చిత్రాలు
  • జోరు పెంచిన మెగాస్టార్
  • మెగా డిసెంబరు అంటూ సోషల్ మీడియాలో చిరు మేనియా
Chiranjeevi mega record
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రికార్డు సృష్టించారు. ఒకే నెలలో నాలుగు చిత్రాలను సెట్స్ మీదకు తీసుకెళ్లడం ద్వారా సినీ ప్రపంచంలో అరుదైన ఘనత అందుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఆచార్య, మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్, బాబీ దర్శకత్వంలో 154వ చిత్రం, మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళాశంకర్ చిత్రాలు డిసెంబరు నెలలో షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇది ఆల్ టైమ్ మెగా రికార్డు అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.