తెలంగాణలో కొత్తగా 195 కరోనా కేసులు

06-12-2021 Mon 22:09
  • గత 24 గంటల్లో 37,108 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 78 కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,810 మందికి చికిత్స
Telangana corona update
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 37,108 కరోనా పరీక్షలు నిర్వహించగా, 195 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 78 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 14, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 171 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,77,138 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 6,69,328 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,810 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 4,000కి పెరిగింది.