Allu Arjun: ఇదిగో 'పుష్ప' ట్రైలర్ వచ్చేసింది!

Allu Arjun Pushpa trailer out now
  • అల్లు అర్జున్ హీరోగా 'పుష్ప'
  • సుకుమార్ దర్శకత్వంలో చిత్రం
  • బన్నీ సరసన రష్మిక మందన్న
  • సునీల్, అనసూయ నెగెటివ్ రోల్స్
  • సినిమా ఎలా ఉంటుందో హింట్ ఇచ్చేసిన చిత్రబృందం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'పుష్ప'. ఈ చిత్రం నుంచి ట్రైలర్ రిలీజైంది. వాస్తవానికి ఈ సాయంత్రం 6.03 గంటలకు ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో విడుదల చేయలేకపోతున్నామని చిత్రబృందం ప్రకటించింది. అయితే కొన్ని గంటల్లోనే ట్రైలర్ ను తీసుకువచ్చి అభిమానులను సంతోషంలో ముంచెత్తింది.

"భూమిపై పెరిగే బంగారం... పేరు ఎర్రచందనం" అంటూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. అల్లు అర్జున్ నటించే యాక్షన్ సీక్వెన్స్ లు, హీరోయిన్ రష్మిక మందన్నతో రొమాన్స్, చిత్తూరు యాస అన్నీ కలగలిపి 'పుష్ప' ఎలా ఉండబోతోందో ఈ ట్రైలర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.
Allu Arjun
Pushpa
Trailer
Sukumar
Rashmika Mandanna

More Telugu News