ముంబయిలో మరో రెండు ఒమిక్రాన్ కేసుల వెల్లడి

06-12-2021 Mon 19:52
  • దేశంలో ఒమిక్రాన్ ఉనికి
  • దక్షిణాఫ్రికా, అమెరికా నుంచి వచ్చిన వ్యక్తుల్లో కొత్త వేరియంట్
  • మహారాష్ట్రలో 10కి పెరిగిన ఒమిక్రాన్ 
  • దేశంలో 23కి పెరిగిన కొత్త వేరియంట్ కేసులు
Two more Omicron positive cases identified in Mumbai
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ముంబయిలో మరో రెండు ఒమిక్రాన్ కేసులను గుర్తించారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అటు, అమెరికా నుంచి వచ్చిన మరో వ్యక్తి (36)కి కూడా కొత్త వేరియంట్ పాజిటివ్ గా వచ్చింది.

వీరిద్దరితో కలిపి మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10కి పెరిగింది. దీంతో దేశం మొత్తమ్మీద ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 23కి పెరిగింది.