'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ ఖరారు!

06-12-2021 Mon 17:43
  • 'ఖిలాడి'గా రవితేజ
  • ఫిబ్రవరి 11వ తేదీన రిలీజ్
  • నెక్స్ట్ మూవీగా 'రామారావు ఆన్ డ్యూటీ'
  • మార్చి 25వ తేదీన విడుదల  
Ramarao On Duty release date confirmed
రవితేజ హీరోగా రూపొందిన 'ఖిలాడి' సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 11వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ సినిమాకి రమేశ్ వర్మ దర్శకత్వం వహించాడు. ఆ తరువాత సినిమాగా రవితేజ .. 'రామారావు ఆన్ డ్యూటీ' చేస్తున్నాడు.

శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, రవితేజ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చేశారు. మార్చి 25వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను వదిలారు. గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ తో కూడిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాకి సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చాడు. రవితేజ సరసన నాయికలుగా దివ్యాన్ష కౌశిక్ - రజీషా విజయన్ అలరించనున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ వారితో కలిసి రవితేజ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. నెల గ్యాపుతో .. అంటే,  ఫిబ్రవరిలో 'ఖిలాడి' .. మార్చిలో 'రామారావు ఆన్ డ్యూటీ' ప్రేక్షకుల ముందుకు రానున్నాయన్న మాట..