ఒమిక్రాన్ భయాలు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

06-12-2021 Mon 17:11
  • 949 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 284 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 3.75 శాతం నష్టపోయిన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్ విలువ
Sensex losses 949 points
ఒమిక్రాన్ వేరియంట్ దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. రోజురోజుకూ పెరుగుతున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో వారు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 949 పాయింట్లు నష్టపోయి 56,747కి పడిపోయింది. నిఫ్టీ 284 పాయింట్లు కోల్పోయి 16,912కి దిగజారింది. బీఎస్ఈ సెన్సెక్స్ లో అన్ని కంపెనీల షేర్లు నష్టపోయాయి.

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.75%), బజాజ్ ఫిన్ సర్వ్ (-3.43%), భారతి ఎయిర్ టెల్ (-2.96%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.94%), టీసీఎస్ (-2.89%).