'ఆర్ ఆర్ ఆర్' నుంచి కొత్త పోస్టర్ .. అల్లూరి సింహనాదం!

06-12-2021 Mon 17:09
  • ఈ రోజు ఉదయం కొమరం భీమ్ కొత్త పోస్టర్
  • అభిమానులను అలరించిన ఎన్టీఆర్
  • ఈ నెల 9వ తేదీన ట్రైలర్ రిలీజ్
  • వచ్చేనెల 7వ తేదీన సినిమా విడుదల
RRR movie update
ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'ఆర్ ఆర్ ఆర్' .. పాన్ ఇండియా స్థాయిలో రూపొందింది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా, చారిత్రక నేపథ్యంతో ముడిపడి నడుస్తుంది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ ఈ సినిమాలో మంచి క్రేజ్ ఉన్న ఆర్టిస్టులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

కీరవాణి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన పాటలకు మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఈ నెల 9వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. మరోపక్క, ఈ రోజు ఉదయం కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసిన టీమ్, కొంతసేపటి క్రితం అల్లూరి సీతారామరాజుగా చరణ్ కొత్త పోస్టర్ ను వదిలింది.

శత్రువులపై విరుచుకుపడటానికి ముందు సింహనాదం చేస్తూ, ఈ పోస్టర్ లో అల్లూరిగా చరణ్ కనిపిస్తున్నాడు. ఫిరంగి గుండ్లను కూడా తన పిడికిలిలో నుసి చేయాలనేంత ఆగ్రహంతో ఆయన కనిపిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో చరణ్ కి సంబంధించిన పోస్టర్స్ లో ఇది హైలైట్ అని చెప్పవచ్చు. జనవరి 7వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు..