KTR: పారిశ్రామికాభివృద్ధికి ఏడున్నరేళ్లలో కేసీఆర్ ఎంతో చేశారు: కేటీఆర్

  • అన్ని సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించుకుంటూ వచ్చాం
  • సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాం
  • పెట్టుబడిదారులకు రాష్ట్రంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి
KCR has done everything for industrialisation says KTR

తెలంగాణలో పరిశ్రమలను ఏర్పాటు చేసే సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సదుపాయాలను కల్పిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. గత ఏడున్నరేళ్ల కాలంలో పారిశ్రామికాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో చేశారని చెప్పారు. సమస్యలన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించుకుంటూ వచ్చామని... తొలుత విద్యుత్ సమస్య లేకుండా చేశామని తెలిపారు. ప్రస్తుతం అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తును అందిస్తున్నామని చెప్పారు.

 సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాదులో జర్మనీ పెట్టుబడిదారుల సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమల కోసం ప్రస్తుతం 2 వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందని చెప్పారు.

More Telugu News