అన్ స్టాపబుల్ కార్యక్రమానికి విచ్చేసిన అఖండ టీమ్... తండ్రిని గుర్తుచేసుకుని బాలయ్య భావోద్వేగం

06-12-2021 Mon 16:03
  • బాలయ్య అఖండ బంపర్ హిట్
  • అన్ స్టాపబుల్ షోలో అఖండ టీమ్
  • వెన్నుపోటు అంశం ప్రస్తావించిన బాలయ్య
  • చెబుతుంటే కన్నీళ్లు వస్తాయని వెల్లడి
Akhanda team at Balakrishna Unstoppable show
ఇటీవల రిలీజైన అఖండ చిత్రం సూపర్ హిట్ టాక్ తో నడుస్తోంది. దర్శకుడు బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల మోత మోగిస్తోంది. తాజాగా అఖండ టీమ్ బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోకి విచ్చేసింది. దర్శకుడు బోయపాటి శ్రీను, నటుడు శ్రీకాంత్, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, సంగీత దర్శకుడు తమన్ ఈ షోలో సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో బాలకృష్ణ ఓ సందర్భంగా తండ్రిని గుర్తుచేసుకుని భావోద్వేగాలకు గురయ్యారు. నాడు తన తండ్రి విషయంలో వెన్నుపోటు అంటూ దుష్ప్రచారం చేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "నేను ఆయన కొడుకునే కాదు, ఆయన అభిమానుల్లోనూ ఒకడిని. కానీ వెన్నుపోటు పొడిచారు అంటూ ప్రచారం చేశారు. దాని గురించి ప్రస్తావన తీసుకువస్తేనే కన్నీళ్లు వస్తాయి" అని వ్యాఖ్యానించారు. అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.