ఓటీఎస్ పేరుతో పేదలపై భారం వేస్తారా?: సీపీఎం అగ్రనేత బీవీ రాఘవులు ఫైర్

06-12-2021 Mon 15:06
  • పేదల ఇళ్ల పథకం కోసం ఓటీఎస్
  • ఏపీ ప్రభుత్వంపై విమర్శలు
  • ఓటీఎస్ పేదలకు వ్యతిరేకమన్న బీవీ రాఘవులు
  • ప్రభుత్వం ఓటీఎస్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్
CPM leader BV Raghavulu questions AP Govt on OTS
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఓటీఎస్ పథకం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దివాళా తీసిన ప్రభుత్వానికి డబ్బులు సమకూర్చుకోవడానికే ఓటీఎస్ పథకం తీసుకువచ్చారని ఆరోపించారు. నిజంగా పేదలకు ఇళ్లపై హక్కు కల్పించాలని అనుకుంటే ఓటీఎస్ విధానం లేకుండా చేయాలని అన్నారు. అంతేగానీ, ఓటీఎస్ పేరుతో పేదలపై భారం వేయడం ఏంటి? అని ప్రశ్నించారు. ఓటీఎస్ అనేది పేదలకు వ్యతిరేకమైన చర్య అని బీవీ రాఘవులు స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం తక్షణమే ఓటీఎస్ ను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.