Revanth Reddy: రేపు మధ్యాహ్నం తర్వాత టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు నుంచి మాయమవబోతున్నారు: రేవంత్ రెడ్డి

Revath Reddy once again fires on TRS govt and TRS MPs
  • టీఆర్ఎస్ సర్కారుపై రేవంత్ రెడ్డి విమర్శలు
  • కేంద్రంతో కలిసి డ్రామాలు ఆడుతోందని ఆగ్రహం
  • కేసీఆర్ ప్రధాని మోదీని ఎందుకు నిలదీయలేదన్న రేవంత్
  • రైతులు ఆగమవుతున్నారని ఆవేదన
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో రైతులు ఆగమవుతున్నారని అన్నారు. రైతుల ఇబ్బందులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధ్వానంగా తయారైందని, అటు పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు నామమాత్రంగా నిరసనలు తెలుపుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఫొటోలకు పోజులు తప్ప టీఆర్ఎస్ ఎంపీలు చేసిందేమీలేదని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో నిరసనలు తెలుపుతున్నామని చెబుతూ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.

రేపటి నుంచి పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీల నిరసనలు ఉండవని, రేపు మధ్యాహ్నం తర్వాత వారు పార్లమెంటు నుంచి మాయమవబోతున్నారని అన్నారు. కేంద్రం నుంచి తెలంగాణ సర్కారుకు ఆదేశాలు అందడమే అందుకు కారణమని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు.

కేసీఆర్ ఢిల్లీకి వచ్చి ప్రధానిని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచుతామన్న కేసీఆర్ ఫాంహౌస్ లో పడుకున్నారని రేవంత్ రెడ్డి వ్యంగ్యం ప్రదర్శించారు.
Revanth Reddy
TRS Govt
TRS MPs
Telangana

More Telugu News