బస్సులపై పసుపు రంగును తొలగించాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం

06-12-2021 Mon 12:24
  • పల్లెవెలుగు బస్సు రంగులను మార్చాలని ఆర్టీసీ నిర్ణయం
  • ప్రస్తుతం బస్సుపై ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నలుపు రంగులు
  • పసుపు రంగు స్థానంలో గచ్చకాయ రంగును మార్చాలని ఆర్టీసీ నిర్ణయం
APSRTC removing yellow colour on Pallevelugu busses
ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లెవెలుగు బస్సులకు రంగును మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అన్ని జిల్లాల్లోని పల్లెవెలుగు బస్సుల రంగులను మార్చాలని ఆదేశాలను జారీ చేశారు.

ప్రస్తుతం పల్లెవెలుగు బస్సులకు ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నలుపు రంగులు ఉన్నాయి. వీటిలో పసుపు రంగును మాత్రం తొలగించనున్నారు. పసుపు రంగు బదులుగా గచ్చకాయ రంగును వినియోగించబోతున్నారు. ఇదే సమయంలో డిజైన్ ను కూడా మార్చబోతున్నారు.