రెండో టెస్టులో భారత్ ఘన విజయం

06-12-2021 Mon 11:53
  • 372 పరుగుల తేడాతో భారత్ జయకేతనం
  • రెండో ఇన్నింగ్స్ లో 165 పరుగులకు ఆలౌటైన న్యూజిలాండ్
  • ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా మయాంక్ అగర్వాల్
India wins second test against New Zealand
ముంబైలో న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా 372 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు కేవలం 165 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 325 పరుగులు చేయగా... కివీస్ కేవలం 62 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.

సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ 276 పరుగులు చేసింది. భారత బౌలర్ల దూకుడుకు కివీస్ బ్యాట్స్ మెన్ నిలవలేకపోయారు. చివరి ఇన్నింగ్స్ లో అశ్విన్, జయంత్ యాదవ్ చెరో 4 వికెట్లు తీయగా.. అక్సర్ పటేల్ ఒక వికెట్ తీశాడు. ఒక బ్యాట్స్ మెన్ రనౌట్ అయ్యాడు. ఈ విజయంతో సిరీస్ ను టీమిండియా 1-0తో కైవసం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా మయాంక్ అగర్వాల్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా అశ్విన్ ఎంపికయ్యారు.