ఇండియాలో కొత్తగా 8,306 కరోనా కేసులు

06-12-2021 Mon 11:17
  • గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న వారు 8,834 మంది
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 98,416
  • ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,46,33,255
India reports 8306 new cases in last 24 hours
మన దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 8,306 మంది కరోనా బారిన పడ్డారు. ఇదే సమయంలో 8,834 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 98,416 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 552 రోజల్లో ఇంత తక్కువ స్థాయిలో యాక్టివ్ కేసులు ఉండటం ఇదే తొలిసారి. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,46,33,255కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.35 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 3,40,60,774 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 127.61 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను వేశారు.