Digvijay Singh: అతనొక విశ్వాస ఘాతుకుడు: సింధియాపై దిగ్విజయ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు

  • జ్యోతిరాదిత్య సింధియాకు కాంగ్రెస్ ఎంతో ఇచ్చింది
  • కాంగ్రెస్ కు ద్రోహం చేసి బీజేపీలో చేరారు
  • ద్రోహులను చరిత్ర క్షమించదు
Scindia is a betrayer says Digvijay Singh

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింధియా విశ్వాస ఘాతుకుడని దిగ్విజయ్ అన్నారు. సింధియాకు కాంగ్రెస్ పార్టీ ఎంతో ఇచ్చిందని... అయినప్పటికీ పార్టీకి ద్రోహం చేసి బీజేపీలో చేరారని మండిపడ్డారు.

దిగ్విజయ్ నియోజకవర్గంలో నిన్న బీజేపీ నిర్వహించిన సభలో సింధియా మాట్లాడుతూ... ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఆయనకు లేదని దిగ్విజయ్ పేరును ఎత్తకుండా విమర్శించారు. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన సింధియా బీజేపీలో చేరారని... డబ్బు ఇచ్చి తమ పార్టీ ఎమ్మెల్యేలను కూడా వెంట తీసుకెళ్లారని విమర్శించారు. ద్రోహులను చరిత్ర క్షమించదని అన్నారు. మోసగాళ్లను రాబోయే తరాలు కూడా గుర్తుంచుకుంటాయని చెప్పారు.

రాణి ఝాన్సీ లక్ష్మీబాయి విషయానికి వస్తే ఆమెకు ద్రోహం చేసిన వారి జాబితాలో సింధియాల కుటుంబం కూడా ఉంటుందా? లేదా? అని ప్రశ్నించారు. పానిపట్ యుద్ధంలో హిందూ రాజులకు అప్పటి సింధియా రాజు సహాయం చేసి ఉంటే... పానిపట్ యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలీ ఓడిపోయేవాడని చెప్పారు. ఇప్పుడు కూడా సింధియా ద్రోహం చేసి ఉండకపోతే... మధ్యప్రదేశ్ లో ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేదని తెలిపారు.

More Telugu News