మహేశ్ బాబుకు ఇష్టమైన ఫుడ్ ఇదేనట!

06-12-2021 Mon 09:24
  • హోమ్ ఫుడ్ అంటే తనకు ఇష్టమని చెప్పిన మహేశ్
  • అమ్మమ్మ చేసిన వంట అంటే అత్యంత ఇష్టమని వెల్లడి
  • ఇంటర్ వరకు క్రికెట్ ఆడానని చెప్పిన మహేశ్
I love home made food says Mahesh Babu
46 ఏళ్ల వయసు వచ్చినా సూపర్ స్టార్ మహేశ్ బాబు చాలా యంగ్ గా కనిపిస్తారు. కుర్ర హీరోలు సైతం ఈర్ష్యపడేలా ఆయన ఫిట్ నెస్ ఉంటుంది. శరీరాన్ని ఇంత పర్ఫెక్ట్ గా ఆయన ఎలా మెయింటైన్ చేస్తున్నారనే ఆసక్తి చాలా మందిలో ఉంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ షో 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమంలో మహేశ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తనకు హోమ్ ఫుడ్ అంటేనే చాలా ఇష్టమని మహేశ్ చెప్పారు. అది కూడా అమ్మమ్మ చేసిన వంట అంటే అన్నిటి కంటే ఇష్టమని అన్నారు. హైదరాబాద్ బిర్యానీ తన ఫేవరెట్ అని చెప్పారు. క్రీడల విషయానికి వస్తే బాస్కెట్ బాల్ చూడటం ఇష్టమని మహేశ్ చెప్పారు. ఇటీవల తాను ఫుట్ బాల్ లీగ్ కూడా చూశానని తెలిపారు.

ఇక ఇంటర్ వరకు తాను క్రికెట్ ఆడేవాడినని చెప్పారు. దీంతో ఎన్టీఆర్ 'మనం కలిసి క్రికెట్ ఆడదామని' అడగ్గా... దానికి మహేశ్ అంగీకరించారు. నాలుగేళ్ల వయసులో తాను నటించడం ప్రారంభించానని తెలిపారు. 'మా ఊళ్లో ఒక పడుచుంది' అనే పాట అంటే తనకు ఇష్టమని... తాను నటించిన చిత్రాల్లో 'ఒక్కడు' తన ఫేవరెట్ మూవీ అని చెప్పారు.