జీవితంలో నేర్చుకున్న గొప్ప పాఠం ఇదే!: సమంత

  • నాగచైతన్య నుంచి విడిపోయిన సమంత
  • సినిమాలు, మోడలింగ్ తో బిజీ
  • సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్
  • తాజాగా ఆసక్తికరమైన పోస్టు
Samantha says there is so much to learn

నాగచైతన్య నుంచి విడిపోయాక సమంత సినిమాలు, ఐటెం సాంగులు, మోడలింగ్ అసైన్ మెంట్లతో బిజీ అయింది. ఎన్ని పనులున్నా సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో మా అమ్మ చెప్పింది పేరిట ఆలోచింపజేసే పోస్టులు చేస్తుంటుంది.

తాజాగా చేసిన పోస్టు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. "నేను ఇప్పటికీ ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నదే జీవితంలో నేను నేర్చుకున్న గొప్ప పాఠం" అని ఆ పోస్టు సారాంశం. అంతేకాదు, మరో పోస్టులో అమెరికా రైటర్ చెరిల్ వ్యాఖ్యలను పంచుకుంది.

More Telugu News