మహారాష్ట్రలో ఒమిక్రాన్ బీభత్సం... ఒకేసారి 7 కేసుల వెల్లడి

05-12-2021 Sun 19:24
  • దేశంలో కొత్త వేరియంట్ కలకలం
  • అత్యధికంగా మహారాష్ట్రలో 8 కేసులు
  • కర్ణాటకలో 2, గుజరాత్ లో 1, ఢిల్లీలో 1 కేసు నమోదు
  • దేశంలో 12కి పెరిగిన ఒమిక్రాన్ వేరియంట్
More Omicron variant cases emerges in Maharashtra
భారత్ లో ఒమిక్రాన్ వ్యాప్తి క్రమంగా వేగం పుంజుకుంటోంది. మహారాష్ట్రలో ఒకేసారి 7 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 8కి చేరింది.

దేశంలో తొలిసారిగా కర్ణాటకలో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసింది. బెంగళూరులో 2 కేసులు వెల్లడయ్యాయి. అటు, గుజరాత్ లో 1, ఢిల్లీలో 1 కేసు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 12కి పెరిగింది.