బాలకృష్ణ టాక్ షోలో మహేశ్ బాబు సందడి

05-12-2021 Sun 18:37
  • ఆహా ఓటీటీలో 'అన్ స్టాపబుల్' టాక్ షో
  • హోస్ట్ గా బాలకృష్ణ
  • తాజా ఎపిసోడ్ లో మహేశ్ బాబుతో ఇంటర్వ్యూ
  • నెట్టింట సందడి చేస్తున్న ఫొటోలు
Mahesh Babu attends Balakrishna Unstoppable talk show
టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ ఓటీటీ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఆయన 'ఆహా' ఓటీటీలో ప్రసారమయ్యే 'అన్ స్టాపబుల్' అనే టాక్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తుండడం తెలిసిందే. ఈ టాక్ షోలో ఇప్పటివరకు మోహన్ బాబు, నాని తదితరులు విచ్చేసి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు.

తాజా ఎపిసోడ్ కు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వచ్చారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. బాలయ్యతో సరదాగా గడిచిందని షూటింగ్ అనంతరం మహేశ్ బాబు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. త్వరలోనే ఈ ఎపిసోడ్ 'ఆహా' ఓటీటీ వేదికపై స్ట్రీమింగ్ కానుంది.