ఏపీలో గత 24 గంటల్లో 154 కరోనా కేసులు

05-12-2021 Sun 17:42
  • గత 24 గంటల్లో 30,979 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 30 కొత్త కేసులు
  • కర్నూలు జిల్లాలో ఒకరికి పాజిటివ్
  • రాష్ట్రంలో నలుగురి మృతి
  • ఇంకా 2,122 మందికి చికిత్స
AP Corona update
ఏపీలో గడచిన 24 గంటల వ్యవధిలో 30,979 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 154 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో 30, విశాఖ జిల్లాలో 20 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. అదే సమయంలో 177 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 20,73,730 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,57,156 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,122 మందికి చికిత్స జరుగుతోంది. అటు, కరోనాతో మరణించినవారి సంఖ్య 14,452కి పెరిగింది.