Rosaiah: ముగిసిన మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు

Former chief minister Rosaiah last rites cuncludes
  • తీవ్ర అస్వస్థతతో కన్నుమూసిన రోశయ్య
  • కొంపల్లి వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు
  • సీనియర్ నేతకు కడసారి వీడ్కోలు పలికిన ప్రముఖులు
  • ఏపీ ప్రభుత్వం తరఫున అంత్యక్రియలకు హాజరైన మంత్రులు
మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య అంత్యక్రియలు ముగిశాయి. ఈ మధ్యాహ్నం రోశయ్య అంత్యక్రియలు హైదరాబాదు శివార్లలోని కొంపల్లి వ్యవసాయక్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.

అంతకుముందు రోశయ్య భౌతికకాయాన్ని అమీర్ పేటలోని నివాసం నుంచి గాంధీభవన్ కు తరలించారు. అక్కడ కాంగ్రెస్ ముఖ్యనేతలు తమ ప్రియతమ నేత పార్థివదేహానికి కడసారి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ హైకమాండ్ తరఫున మల్లికార్జున ఖర్గే రోశయ్య భౌతికకాయం వద్ద పుష్పాంజలి ఘటించారు.

మధ్యాహ్నం తర్వాత రోశయ్య అంతిమయాత్ర ప్రారంభమైంది. కొంపల్లి ఫాంహౌస్ లో అంత్యక్రియలు నిర్వహించారు. రోశయ్య అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు.
Rosaiah
Last Rires
Kompally
Hyderabad
Congress

More Telugu News