Bandminton: సింధు సిల్వర్ తో సరి.. బీడబ్ల్యూఎఫ్ ఫైనల్ లో ఉక్కిరిబిక్కిరి చేసిన ప్రత్యర్థి

Sindhu Lost To South Korean Player In BWF World Tour Final
  • దక్షిణ కొరియా ఆన్ సేయంగ్ చేతిలో పరాజయం
  • 16–21, 12–21 తేడాతో ఓటమి
  • ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన సేయంగ్
  • నెట్, బేస్ లైన్ ప్లేతో సింధుకు సవాల్

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ లో సింధు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఇండోనేషియాలోని బాలిలో ఇవాళ జరిగిన ఫైనల్స్ లో ఆమె ఓడిపోయింది. దక్షిణ కొరియా ఆన్ సేయంగ్ చేతిలో 16–21, 12–21 చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలైంది. వరల్డ్ నంబర్ సిక్స్ అయిన సేయంగ్ ఆటకు ఏ దశలోనూ సింధు పోటీ ఇవ్వలేకపోయింది. నెట్ ప్లే, బేస్ లైన్ గేమ్ తో సింధుకు సేయంగ్ సవాల్ విసిరింది. ఎక్కడ కూడా సింధుకు అవకాశం ఇవ్వకుండా ఆది నుంచీ ఆధిపత్యం ప్రదర్శించింది. సింధును ఉక్కిరిబిక్కిరి చేసింది.

కాగా, ఇండోనేషియా మాస్టర్స్, ఇండోనేషియా ఓపెన్ టైటిల్స్ నెగ్గి జోరు మీదున్న సేయంగ్.. అదే జోరుతో డబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ లోకి ప్రవేశించింది. కాగా, గత అక్టోబర్ లో జరిగిన డెన్మార్క్ ఓపెన్ లోనూ క్వార్టర్ ఫైనల్స్ లో సింధును సేయంగ్ ఓడించింది. డబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ లో ఫైనల్ కు వెళ్లడం సింధుకు ఇది మూడోసారి. అంతకుముందు 2018లో సింధు తొలిసారి టైటిల్ ను గెలిచి.. మొదటి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.

  • Loading...

More Telugu News