Tollywood: యాంకర్ అనసూయ తండ్రి మృతి

Anasuya Father Dies
  • కేన్సర్ తో కొంతకాలంగా అనారోగ్యం
  • ఇవాళ తన ఇంట్లోనే తుది శ్వాస
  • రాజీవ్ గాంధీ హయాంలో యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా బాధ్యతలు
ప్రముఖ యాంకర్, సినీ నటి అనసూయ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి సుదర్శన్ రావు (63) ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని తార్నాకలోని తన ఇంట్లో కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్ తో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రాణాలు వదిలారు. సినీ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించారు. అనసూయ కుటుంబానికి సానుభూతి తెలిపారు.

కాగా, సుదర్శన్ రావు వ్యాపారవేత్త. కాంగ్రెస్ లో సుదర్శన్ రావు చాలా కాలం పాటు పనిచేశారు. రాజీవ్ గాంధీ హయాంలో యూత్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా వ్యవహరించారు. తన తల్లి పేరు ‘అనసూయ’నే తన కూతురుకు పెట్టుకున్నారు. ఆయనకు అనసూయతో పాటు మరో కుమార్తె ఉంది.

Tollywood
Anasuya
Anchor

More Telugu News