Rosaiah: మాజీ సీఎం రోశయ్య భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు

Leaders pays tributes to Rosaiah
  • అమీర్ పేటలో రోశయ్య పార్థివదేహం
  • ఈ మధ్యాహ్నం అంత్యక్రియలు
  • హాజరుకానున్న ఏపీ మంత్రులు
  • రోశయ్యకు కిషన్ రెడ్డి, చిరంజీవి నివాళి
మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. కాగా, అమీర్ పేటలోని ఆయన నివాసానికి ప్రముఖులు తరలివచ్చారు. పార్టీలు, వర్గాలకు అతీతంగా అందరికీ కావాల్సిన వాడిగా గుర్తింపు తెచ్చుకున్న రోశయ్యకు ఘననివాళి అర్పించారు. ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ఎమ్మెల్యే మేరుగ నాగార్జునరెడ్డి విచ్చేశారు. రోశయ్య భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. అటు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా కాంగ్రెస్ సీనియర్ నేతకు నివాళి అర్పించారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి... రోశయ్య భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఏపీ, తెలంగాణ ప్రజలకు రోశయ్యలేని లోటు తీర్చలేనిదని అన్నారు. అసెంబ్లీలో రాజకీయంగా ఘర్షణ పడినా, తాము శత్రువులం మాత్రం కాదని చెప్పారు. నాడు వైఎస్ కు రోశయ్య ఓ రక్షక కవచంలా ఉండేవారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాగా, సొంత వ్యవసాయక్షేత్రంలో ఈ మధ్యాహ్నం రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఏపీ మంత్రులు అంత్యక్రియలకు కూడా హాజరుకానున్నారు.
Rosaiah
Tributes
Congress
Andhra Pradesh
Telangana

More Telugu News