10/10 క్లబ్ లోకి అజాజ్ పటేల్ ను స్వాగతించిన అనిల్ కుంబ్లే

05-12-2021 Sun 08:54
  • ముంబయిలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్
  • తొలి ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన అజాజ్ పటేల్
  • గతంలో ఈ ఘనత సాధించిన జిమ్ లేకర్, కుంబ్లే
  • అజాజ్ పటేల్ కు కుంబ్లే అభినందనలు
Anil Kumble welcomed Azaz Patel into their club
టీమిండియాతో ముంబయిలో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో న్యూజిలాండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసి అరుదైన ఘనత సాధించాడు. గతంలో ఇదే ఘనతను జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే నమోదు చేశారు. 10కి 10 వికెట్లు తీసిన అజాజ్ పటేల్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనిపై భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే స్పందించాడు. 10/10 క్లబ్ లోకి అజాజ్ పటేల్ కు స్వాగతం పలికాడు.

"ముంబయి టెస్టులో తొలి రెండు రోజులు అద్భుతంగా బౌలింగ్ చేశావు... ఇది ఎంతో ప్రత్యేకమైన ఘనత" అంటూ కితాబిచ్చాడు. అయితే, ఇకనుంచి అజాజ్ పటేల్ ఎప్పుడు మైదానంలో దిగినా అతడి నుంచి 10 వికెట్ల ప్రదర్శన ఆశిస్తారని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఓ వీడియో సందేశం వెలువరించాడు.