'భీమ్లా నాయక్' కోసం పవన్ పాట!

04-12-2021 Sat 18:36
  • ఇద్దరి వ్యక్తుల ఈగో చుట్టూ తిరిగే కథ
  • పవన్ భార్య పాత్రలో నిత్యామీనన్
  • రానా సరసన సంయుక్త మీనన్
  • జనవరి 12వ తేదీన విడుదల
Bheemla Nayak movie update
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా 'భీమ్లా నాయక్' రూపొందింది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి, సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి వదులుతున్న ఒక్కో సింగిల్ జనంలోకి దూసుకుపోతున్నాయి .. అంతకంతకు అంచనాలు పెంచుతున్నాయి.

ఈ సినిమా కోసం పవన్ తో తమన్ ఒక పాట పాడించినట్టుగా చెబుతున్నారు. గతంలో పవన్ తన సినిమాల కోసం అప్పుడప్పుడు పాటలు పాడాడు. 'కాటమరాయుడా .. కదిరి నరసింహుడా' .. 'కొడకా కోటేశ్వరరావు' పాటలు బాగా పాప్యులర్ అయ్యాయి. అలాంటి ఒక హుషారైన పాటనే 'భీమ్లా నాయక్' ద్వారా పలకరించనుందని అంటున్నారు.

ఇద్దరి వ్యక్తుల మధ్య ఈగో ఏ స్థాయి వరకు వెళుతుంది? అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది? అనే ప్రధానమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నిత్యా మీనన్ .. సంయుక్త మీనన్ నటించిన ఈ సినిమాను, జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించడం విశేషం.