పోలీస్ జిమ్ లో కసరత్తులు చేసిన మంత్రి కొడాలి నాని.... వీడియో ఇదిగో!

04-12-2021 Sat 18:27
  • కృష్ణా జిల్లాలో పోలీసుల కోసం జిమ్ ఏర్పాటు
  • ప్రారంభోత్సవం చేసిన మంత్రి కొడాలి నాని
  • కార్యక్రమానికి హాజరైన మరో మంత్రి పేర్ని నాని
  • జిమ్ లో పరికరాల గురించి వివరించిన ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్
AP Minister Kodali Nani attends Police Gym opening ceremony
కృష్ణా జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన పోలీస్ జిమ్ ను ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సమాచార ప్రసార శాఖ మంత్రి పేర్ని నాని కూడా హాజరయ్యారు. తనతో పాటు రిబ్బన్ కటింగ్ చేయాలని కొడాలి నాని... పేర్ని నానిని కోరగా... మీరు చేసేయండి అంటూ ఆయన దూరంగా వెళ్లిపోయారు. దాంతో కొడాలి నాని తానొక్కడే రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు.

అనంతరం జిమ్ లో ప్రవేశించిన ఆయన అక్కడ రకరకాల కసరత్తులు చేశారు. ఎంతో ఉత్సాహంగా పలు పరికరాలను ఉపయోగించి వ్యాయామం చేశారు. ఈ సందర్భంగా జిమ్ లో పరికరాల గురించి కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వివరించారు. దీనికి సంబంధించిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.