బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన పీవీ సింధు

04-12-2021 Sat 18:10
  • ఇండోనేషియాలో వరల్డ్ టూర్ ఫైనల్స్
  • సెమీస్ లో యమగుచిపై సింధు విజయం
  • మూడు గేమ్ ల పాటు హోరాహోరీ పోరు
  • రేపు ఫైనల్ మ్యాచ్
PV Sindhu enters into World Tour Finals Summit Clash after beating Japanese player Yamaguchi
తెలుగుతేజం పీవీ సింధు మరో ప్రపంచ టైటిల్ కు అడుగుదూరంలో నిలిచింది. ఇండోనేసియాలోని బాలిలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ చాంపియన్ షిప్ లో సింధు ఫైనల్స్ కు దూసుకెళ్లింది.  మూడు గేమ్ ల పాటు హోరాహోరీగా సాగిన సెమీఫైనల్ పోరులో సింధు జపాన్ షట్లర్ యమగుచిని 21-15, 15-21, 21-19తో ఓడించింది. సింధు ప్రపంచ ర్యాంకింగ్స్ లో ఏడో స్థానంలో ఉండగా, యమగుచి మూడో స్థానంలో ఉంది.

వరల్డ్ టూర్ చాంపియన్ షిప్ పోటీల్లో సింధు ఫైనల్స్ చేరడం ఇది మూడోసారి. 2018లో ఆమె టైటిల్ నెగ్గి వరల్డ్ టూర్ చాంపియన్ గా నిలిచిన ఏకైక భారత షట్లర్ గా చరిత్ర సృష్టించింది.