RRR: డిసెంబరు 9న 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజ్

  • 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారు
  • సోషల్ మీడియాలో వెల్లడించిన రాజమౌళి
  • ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు
  • వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు ఆర్ఆర్ఆర్
RRR trailer set to out

'ఆర్ఆర్ఆర్' (రౌద్రం రుధిరం రణం) చిత్రం ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్సయింది. ఈ నెల 9న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నామని దర్శకుడు రాజమౌళి వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలు కాగా, అలియా భట్, ఒలివియా మోరిస్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఇటీవలే ఈ చిత్రం గ్లింప్స్ కూడా విడుదల కాగా, సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభించింది. ఆర్ఆర్ఆర్ చిత్రం 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో అనేక చిత్రాల విడుదలపై అస్పష్టత నెలకొంది.

  • Loading...

More Telugu News