'లక్ష్య' నుంచి మరో లిరికల్ సాంగ్!

04-12-2021 Sat 17:30
  • నాగశౌర్య నుంచి 'లక్ష్య'
  • సంగీత దర్శకుడిగా కాలభైరవ 
  • కీలకమైన పాత్రలో జగపతిబాబు
  • డిసెంబర్ 10వ తేదీన విడుదల
Lakshya song released
ఈ మధ్య కాలంలో తెలుగులో కూడా స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చే సినిమాల సంఖ్య పెరుగుతోంది. 'జెర్సీ' సినిమా నుంచి స్పోర్ట్స్ నేపథ్యం కలిగిన కథలు ఎక్కువగా తెరపైకి వస్తున్నాయి. అలా విలువిద్య నేపథ్యంలో రూపొందిన సినిమానే 'లక్ష్య'. సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును వదిలారు. "ఆకాశమే తలే ఎత్తేనే నా ప్రేమ కొలిచేందుకే .. భూగోళమే పెంచే వేగమే నిను నన్ను కలిపేందుకే" అంటూ ఈ పాట సాగుతోంది. కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను జునైద్ కుమార్ ఆలపించాడు. సాహిత్యం .. ట్యూన్ రెండూ కూడా అంతగా మనసును పట్టుకునేలా అనిపించవు.

డిసెంబర్ 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు ఒక కీలకమైన పాత్రను పోషించాడు. లక్ష్యాన్ని సాధించడానికి హీరో చేసే ప్రయాణంలో ఎలాంటి అవాంతరాలు ఎదురవుతాయనేదే కథ. ఈ సినిమా కోసం నాగశౌర్య ఎంతో కసరత్తు చేశాడు. ఆయన ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.