కొత్త రోడ్డుకు కొబ్బరికాయ కొడితే.. ఏం పగిలిందో తెలుసా?

04-12-2021 Sat 17:10
  • ఉత్తరప్రదేశ్ లోని బిజ్నూరులో కొత్త రోడ్డును ప్రారంభించిన మహిళా ఎమ్మెల్యే
  • కొబ్బరికాయ కొడితే కంకర బయటకు వచ్చిన వైనం
  • అధికారులపై కన్నెర్ర చేసిన ఎమ్మెల్యే
Gavel came out when coconut break on newly constructed road
కొత్తగా రోడ్డును ప్రారంభించడానికి వచ్చిన మహిళా ఎమ్మెల్యే సుచి చౌదరికి షాక్ తగిలింది. రోడ్డుకు పూజ చేసి కొబ్బరికాయ కొట్టారామె. అయితే కొబ్బరికాయ పగలకుండా రోడ్డులోని కంకరరాళ్లు బయటకు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఆమె తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇంత నాసిరకంగా రోడ్డును నిర్మించారా? అంటూ అధికారులపై కన్నెర్ర చేశారు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బిజ్నూరులో జరిగింది. 7 కిలోమీటర్ల ఈ రోడ్డును కోట్లు ఖర్చు చేసి నిర్మించారు. కొబ్బరికాయ కొట్టగానే రాళ్లు బయటకు రావడంతో ఎమ్మెల్యే భర్త పార తీసుకొచ్చి చదును చేశారు. దీనిపై ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మాట్లాడుతూ రోడ్డు శాంపిల్ ను పరీక్షల కోసం పంపించామని తెలిపారు. మరోవైపు జనాలు కూడా రోడ్డు నాణ్యతపై మండిపడుతున్నారు.