సఫారీలో పర్యాటకుల వాహనంపై భారీ ఏనుగు దాడి.. పర్యాటకులు పరుగోపరుగు.. ఇదిగో వీడియో!

04-12-2021 Sat 16:38
  • దక్షిణాఫ్రికాలోని సఫారీలో భయానక ఘటన
  • వాహనాన్ని గుద్దుతూ బీభత్సం చేసిన భారీ ఏనుగు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
Elephant attacks tourists vehicle on South Africa safari
సఫారీకి వెళ్లిన పర్యాటకుల వాహనంపై ఓ భారీ ఏనుగు దాడి చేసిన భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దక్షిణాఫ్రికాలోని సెలాటి గమే రిజర్వ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. పర్యాటకుల వాహనంలో సుశిక్షితులైన గైడ్లు కూడా ఉన్నారు. వాహనం వెళ్తుండగా దారిలో ఎదురుగా ఏనుగులు నిలబడ్డాయి. దీంతో వారు వాహనాన్ని నిలబెట్టారు.

వెంటనే పక్కనుంచి వచ్చిన ఏనుగు వాహనంపై దాడి చేసింది. వాహనాన్ని ఢీకొడుతూ పల్టీలు కొట్టించింది. ఈ ఏనుగు దాదాపు 13 అడుగులు ఉంది. ఏనుగు కోపానికి పర్యాటకులు, గైడ్లు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు పెట్టారు. రోమాలు నిక్కబొడిచే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.