రోశయ్య మృతికి మూడ్రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన ఏపీ సర్కారు

04-12-2021 Sat 15:48
  • మాజీ సీఎం రోశయ్య అస్తమయం
  • తీవ్ర అస్వస్థతతో కన్నుమూత
  • నేడు, రేపు, ఎల్లుండి సంతాప దినాలు
  • ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
AP Govt announces three days of mourning for Rosaiah demise
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య తీవ్ర అస్వస్థతతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా ఆయన మృతికి ఏపీ ప్రభుత్వం మూడ్రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. నేడు, రేపు, ఎల్లుండి సంతాప దినాలు అని ఓ ప్రకటనలో వెల్లడించింది.

అటు, రోశయ్య భౌతికకాయానికి తెలంగాణ మంత్రి హరీశ్ రావు నివాళి అర్పించారు. అమీర్ పేటలోని రోశయ్య నివాసానికి వెళ్లిన హరీశ్ రావు... మాజీ ముఖ్యమంత్రి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రతిపక్షాలను కూడా తన నేర్పిరితనంతో మెప్పించేవారని రోశయ్యను కీర్తించారు. ప్రతి పార్టీలోనూ ఆయనకు మిత్రులున్నారని, ఆయనతో తనకు ఎంతో అనుబంధం ఉందని హరీశ్ గుర్తు చేసుకున్నారు.