రోశయ్య మృతితో ఎంతో బాధకు గురవుతున్నా: మోదీ

04-12-2021 Sat 15:29
  • రోశయ్యతో మాట్లాడిన మాటలు గుర్తొస్తున్నాయి
  • ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి
  • రోశయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా
Modi pays condolences to Rosaiah
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పట్ల ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. రోశయ్య మృతితో ఎంతో బాధకు గురయ్యానని చెప్పారు. తామిద్దరం ముఖ్యమంత్రులుగా పని చేసినప్పుడు, ఆయన తమిళనాడు గవర్నర్ గా ఉన్నప్పుడు తమ మధ్య జరిగిన సంభాషణలు గుర్తొస్తున్నాయని తెలిపారు.

సమాజం కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పారు. రోశయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రోశయ్య తనను కలిసినప్పటి ఫొటోను షేర్ చేశారు.