దక్షిణాఫ్రికా పర్యటనపై బీసీసీఐ కీలక నిర్ణయం!

04-12-2021 Sat 13:44
  • యథాతథంగా దక్షిణాఫ్రికా టూర్ జరుగుతుందన్న జై షా
  • టీ20 సిరీస్ ను మాత్రం వాయిదా వేస్తున్నట్టు ప్రకటన
  • డిసెంబర్ 17 నుంచి దక్షిణాఫ్రికా టూర్ ప్రారంభం
BCCI announces South Africa tour will continue
ఒమిక్రాన్ వైరస్ దక్షిణాఫ్రికాలో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పరిస్థితులు ఎలా ఉన్నా... దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తున్నట్టు ప్రకటించింది. బీసీసీఐ కార్యదర్శి జై షా మీడియాతో మాట్లాడుతూ, దక్షిణాఫ్రికా టూర్ లో టీమిండియా మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడుతుందని తెలిపారు.

అయితే మూడు టీ20ల సిరీస్ ను మాత్రం వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. టీ20 సిరీస్ షెడ్యూల్ ను తర్వాత ప్రకటిస్తామని వెల్లడించారు. డిసెంబర్ 17 నుంచి దక్షిణాఫ్రికా టూర్ ప్రారంభమవుతుంది.